ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 05, 2020 , 01:40:50

కేటీపీఎస్‌ 9వ యూనిట్‌లో చివరి దశకు ఓవరాల్‌ పనులు

కేటీపీఎస్‌ 9వ యూనిట్‌లో చివరి దశకు ఓవరాల్‌ పనులు

మరో రెండు రోజుల్లో విద్యుత్‌ ఉత్పత్తి..

పాల్వంచ:  కేటీపీఎస్‌ 5వ దశలోని 9వ యూనిట్‌లో ఎట్టకేలకు ఓవరాల్‌ పనులు పూర్తి కావొచ్చాయి. మరో రెండు రోజుల్లో తిరిగి విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టేందుకు టీఎస్‌ జెన్‌కో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. టర్బయిన్‌కు సంబంధించి ఇన్స్‌లేషన్‌ అమర్చే ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. ఇది పూర్తయిన వెంటనే ఉత్పత్తి చేపట్టనున్నారు. వాస్తవానికి జులై 31వ తేదీ వరకు యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభంకావాల్సి ఉంది. జూన్‌ 4న ఓవరాల్‌ పనులు చేపట్టినా పూర్తిస్థాయిలో 12వ తేదీ నుంచి పనులు ముమ్మరంగా చేయనున్నారు. ఎక్కడా తేడా రాకుండా 5,6 దశల సీఈ రవీంద్రకుమార్‌ నేతృత్వంలో పనులు కొనసాగాయి. ఓవరాల్‌ పనుల బాధ్యతలను స్వీకరించిన బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి సాంకేతిక నిపుణులు, బీహెచ్‌ఈఎల్‌కు చెందిన ఇంజినీర్లను తీసుకొచ్చి  పనులను వేగవంతంగా చేస్తున్నారు. అన్ని పనులు సక్రమంగా జరుగుతున్న క్రమంలో టర్బయిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. టర్బయిన్‌లోని మూడు విభాగాలను ఊడదీసి పాడైపోయిన సామగ్రిని తొలగించి కొత్త పరికరాలను అమర్చారు. అన్ని పూర్తి చేసిన తర్వాత యూనిట్‌ను లైటప్‌ చేసి పనితీరును పరిశీలించగా పలు సాంకేతిక సమస్యలను ఇంజినీర్లు గుర్తించారు. వాటిని కూడా సరిచేసి తర్వాత టర్బయిన్‌కు సంబంధించి ఇన్స్‌లేషన్‌ పనులు పూర్తి చేస్తున్నారు. ఉష్ణోగ్రతలను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు దాని పై భాగంలో ఈ ఇన్స్‌లేషన్‌ అమరుస్తుంటారు. ఈ పనులు మరో రెండు రోజుల్లో పూర్తి చేసి యూనిట్‌లో సింక్రనైజేషన్‌ చేసి 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని తిరిగి చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం యూనిట్‌ను లైటప్‌ చేసి అన్ని విభాగాలు ప్రధానంగా బాయిలర్‌, టర్బయిన్‌లు సక్రమంగా ఉ న్నాయనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఉత్పత్తి  ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనిపై కేటీపీఎస్‌ 5,6 దశల సీఈని సంప్రదించగా దాదాపుగా పనులన్నీ పూర్తి కావొచ్చాయని, మరో రెండు రోజుల్లో యూనిట్‌ను లైటప్‌ చేసి ఉత్పత్తి చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. logo