శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 03, 2020 , 03:37:05

స్వీయ నియంత్రణతో కరోనాను ఎదుర్కోవాలి

స్వీయ నియంత్రణతో కరోనాను ఎదుర్కోవాలి

  • డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌

కొత్తగూడెం: ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి  కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌నాయక్‌ అన్నారు.  మాస్కులు ధరించడం, విధిగా భౌతికదూరాన్ని పాటించడం,  తప్పనిసరిగా సబ్బు, శానిటైజర్‌తో  చేతులను శుభ్రపర్చుకోవాలని అన్నారు. రోజూ తాజా ఆహార పదార్ధాలను తీసుకోవాలని, వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటే  వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. కరోనా వ్యాధిని గుర్తించడంలో, నియంత్రించడంలో ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. కరోనా వ్యాధి ఉంటే కరోనా పరీక్షలు నిర్వహించి వారికి కూడా పూర్తిస్థాయి చికిత్స అందజేస్తూ హోం ఐసొలేషన్‌లోనే ఉండాలని, వ్యాధి కట్టడి చర్యలు, నిరోధక చర్యలు చేపట్టాలని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, చిన్నపిల్లలు, జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.