శనివారం 08 ఆగస్టు 2020
Badradri-kothagudem - Aug 02, 2020 , 01:50:54

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

త్యాగానికి ప్రతీక  బక్రీద్‌

కొత్తగూడెం: బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. శనివారం పెద్దల పండుగను జరుపుకున్న ముస్లింలు శనివారం తెల్లవారుజామున మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 మంది మాత్రమే ప్రార్ధనల్లో ఉండాలని చెప్పడంతో ఆయా మసీదుల పెద్దలు ఈ చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ప్రవేశం లేనందున ఇళ్లల్లోనే ఉండి ప్రార్ధనలు చేశారు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి మెలిసి పండుగను జరుపుకున్నారు.

పాల్వంచ: పాల్వంచ పట్టణంలో శనివారం బక్రీద్‌ పండుగను నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు ఉండటంతో ఇంట్లోనే నమాజ్‌లు చేసుకున్నారు. అనంతరం పెద్దలకు సమాధుల వద్ద పూలు చల్లి ప్రార్థనలు చేశారు. మసీదుల్లో 50 మందికి మాత్రమే అనుమతి ఉండటంతో వృద్ధులు, పిల్లలు ఇంటి పట్టునే ఉండి నమాజ్‌లు చేసుకున్నారు. 

చుంచుపల్లి: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ వేడుకలను ముస్లిం సోదరులు శనివారం జరుపుకున్నారు. మండలంలోని పెనగడప, రుద్రంపూర్‌, గౌతంపూర్‌, విద్యానగర్‌ కాలనీ, త్రీ ఇైంక్లెన్‌ వివిధ ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు మసీదుల వద్ద ముస్లిం సోదరులు చేరుకొని  భౌతికదూరం పాటిస్తూ ప్రార్ధనలు చేశారు. బాబూ క్యాంప్‌లోని సర్పంచ్‌ బాబురావు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ డే సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత సీనియర్‌ స్కౌట్స్‌ లీడర్‌ ఖాసీంకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

పాల్వంచ రూరల్‌: ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగను శనివారం జరుపుకున్నారు. త్యాగాలకు ప్రతీక అయిన ఈ పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండలంలోని జగన్నాధపురం, కిన్నెరసాని, లక్ష్మీదేవిపల్లి(ఎస్‌) పంచాయతీల్లో ముస్లింల సంఖ్య అధికంగా ఉంటుంది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఇండ్లలోనే పండుగ నమాజును ఆచరించారు. సమాధుల వద్దకు వెళ్లి గతించిన వారికి నివాళులర్పించారు.

కొత్తగూడెం టౌన్‌: త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్‌ వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రార్ధనలను నిషేదించడంతో ప్రతి ఒక్కరూ మసీదుల్లో, ఇళ్ల వద్ద  భౌతికదూరం పాటిస్తూ ప్రార్ధనలు చేశారు. కరచాలనం చేయవద్దని చెప్పడంతో ఒకరికొకరు వాట్సప్‌ మెసేజ్‌లతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే మసీదుల వద్ద ప్రార్ధనలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.logo