ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 02, 2020 , 01:39:43

కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత

కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత

పాల్వంచ రూరల్‌ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ద్వార 8వేల క్యూసెక్కుల నీటిని శనివారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి రిజర్వాయర్‌లో చేరుతుంది. ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులోకి రానున్న వరద ప్రవాహాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లను ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కిన్నెరసాని పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్‌సైట్‌ అధికారులు ముందస్తు హెచ్చరికలు చేశారు.