గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 02, 2020 , 01:07:01

ఆయిల్‌పాం సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్‌

ఆయిల్‌పాం సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్‌

  • ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం 
  • n భద్రాద్రి జిల్లాలో 33,812, ఖమ్మం జిల్లాలో 6,845 ఎకరాల్లో పంట
  • n విద్య, వైద్యరంగంలో ఉన్నా వ్యవసాయంపైనే మక్కువ 
  • n రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • n అప్పారావుపేటలో పామాయిల్‌ ఫ్యాక్టరీ సందర్శన
  • n నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ బలోపేతం ‘తాటి’తోనే సాధ్యం
  • n ‘పేట’ పగ్గాలు ‘తాటి’కి అప్పగించిన మంత్రి
  • n గ్రూపులు కడితే సహించేది లేదని కార్యకర్తలకు సూచన

రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగుకు సబ్సిడీలు అందించి ప్రభుత్వం ప్రోత్సాహమిస్తోందని, ఈ సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్‌ ఫ్యాక్టరీని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని పలు విభాగాలను, పామాయిల్‌ గెలలు, ముడిసరుకు, వివిధ విత్తనాలను పరిశీలించారు. అనంతరం రైతు సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం పామాయిల్‌ మొక్కలు, ఎరువులు, డ్రిప్‌లకు రాయితీలు అందిస్తోందని అన్నారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకుని ఆయిల్‌పాం సాగు వైపు ఆసక్తి చూపాలని కోరారు. తాను వ్యక్తిగతంగా అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడలిస్టునని, విద్య, వైద్య రంగాల్లో ఉన్నా తనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువని గుర్తు చేసుకున్నారు. 

-దమ్మపేట 

దమ్మపేట : రాష్ట్రంలో ఆయిల్‌ఫాం సాగుకు సబ్సిడీలు అందించి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్‌ ఫ్యాక్టరీని మంత్రి అజయ్‌ శనివారం సందర్శించారు. ఫ్యాక్టరీలోని పలు విభాగాలను; పామాయిల్‌ గెలలు, ముడిసరుకు, వివిధ విత్తనాలను పరిశీలించారు. అనంతరం రైతు సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పామాయిల్‌ మొక్కలు, ఎరువులు, డ్రిప్‌లకు రాయితీలు అందిస్తోందని అన్నారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకుని ఆయిల్‌పాం సాగు వైపు ఆసక్తి చూపాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో అశ్వారావుపేట, అప్పారావుపేటల్లో ఫ్యాక్టరీల విస్తరణ జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40,872 ఎకరాల్లో పామాయిల్‌ పంటలు ఉండగా ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 33,812 ఎకరాల్లో సాగవుతున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో 6845 ఎకరాల్లో రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారన్నారు. ఆయిల్‌పాం సాగుతో రైతుల భవిష్యత్‌ ఉజ్వలంగా మారిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో ఆయిల్‌పాం సాగును విస్తరించానే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆయిల్‌ ఉత్పత్తులకు దేశంలో మంచి డిమాండ్‌ ఉందన్నారు. 131 కోట్ల జనాభాకు 21 మెట్రిక్‌ లక్షల టన్నుల నూనె అవసరం ఉండగా దేశీయంగా 7 లక్షల మెట్రిక్‌ టన్నుల నూనె మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు. 15 మెట్రిక్‌ టన్నుల నూనెను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అందువల్ల రైతులు నిస్సందేహంగా పామాయిల్‌ తోటలు వేసుకుని లాభాలను ఆర్జించవచ్చన్నారు.

దమ్మపేటం అప్పారావుపేట పామాయిల్‌ ప్యాక్టరీ నిర్మాణంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కృషి అభినందనీయమన్నారు. తాను వ్యక్తిగతంగా అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడలిస్టునని, విద్య, వైద్య రంగాల్లో ఉన్నా తనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువని గుర్తు చేసుకున్నారు. ఆయిల్‌ పాం సాగు నిర్వహణ గురించి పూర్తి అవగాహన కోసం ఈ పర్యటనకు వచ్చినట్లు అజయ్‌ తెలిపారు. పరిశ్రమ విస్తరణ, ఇతర అంశాలను కూలంకషంగా తెలుసుకున్నానన్నారు. ఆయిల్‌పాం సాగును నూతనంగా చేపట్టాలనుకునే వారికి ఈ ప్రాంత రైతులే మార్గదర్శకులన్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రైతులు పామాయిల్‌ సాగును ఆసక్తిగా చేపట్టడం ఆనందంగా ఉందని, పామాయిల్‌ సాగును మరింత విస్తరించేలా రైతులు సంసిద్ధులవ్వాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కొయ్యల అచ్యుతరావు, ఎంపీపీ సోయం ప్రసాద్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత, ఆయిల్‌ఫెడ్‌ డివిజనల్‌ అధికారులు ప్రవీణ్‌రెడ్డి, అప్పారావు, అశ్వారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్లు శ్రీకాంత్‌రెడ్డి, బాలకృష్ణ, మండల ఉద్యానశాఖ అధికారి సందీప్‌, పామాయిల్‌ రైతులు పాల్గొన్నారు.