బుధవారం 05 ఆగస్టు 2020
Badradri-kothagudem - Aug 01, 2020 , 00:34:47

మెయిన్‌ ఆస్పత్రిని సందర్శించిన డైరెక్టర్‌

మెయిన్‌ ఆస్పత్రిని సందర్శించిన డైరెక్టర్‌

కొత్తగూడెం సింగరేణి: కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల ఆరోగ్య విషయాలను తెలుసుకునేందుకు సింగరేణి డైరెక్టర్‌ (పా, ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ శుక్రవారం కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ 19 వార్డు, ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధితుల్లో ధైర్యాన్ని నింపి అవసరమైన మందులు అందించాలని సూచించారు. 


logo