మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 31, 2020 , 04:29:31

ఏసీబీ వలలో అవినీతి చేపలు

ఏసీబీ వలలో అవినీతి చేపలు

  • n రేషన్‌ కార్డు మంజూరుకు  రూ.1500 డిమాండ్‌
  • n లంచం తీసుకుంటూ  పట్టుబడిన వీఆర్‌వో, కంప్యూటర్‌ ఆపరేటర్‌
  • n వైరా తహసీల్దార్‌ కార్యాలయంలో ఘటన
  • n కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు
వైరా మండల రెవెన్యూ శాఖలో అవినీతి దందా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. వివిధ           ప నుల కోసం వచ్చిన ప్రజల నుంచి ఇక్కడి సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారు. తమ పనుల కోసం చెప్పులరిగేలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించక, అవినీతి దం దాను భరించలేక విసిగివేసారిన బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. లంచావతారులను పట్టిస్తున్నారు.
వైరా: వైరా తహసీల్దార్‌ కార్యాలయంపై గురువారం ఖమ్మం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకున్న గొల్లపూడి వీఆర్వోను, రెవెన్యూ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ వరంగల్‌ డీఎస్పీ, ఖమ్మం ఇన్‌ చారి ్జడీఎస్పీ ఎ.మధుసూదన్‌ తెలిపిన వివరాలు...
వైరా మండలంలోని గొల్లపూడి గ్రామానికి చెందిన దొబ్బల వేణుకుమార్‌.. హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ కళాశాల లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. మూడు నెలల క్రితం స్వగ్రామం వచ్చారు. వేణుకుమార్‌కు, ఆయన తల్లిదండ్రులకు కలిపి తెల్ల రేషన్‌ కార్డు ఉంది. వేణుకుమార్‌కు ఆరు నె లల క్రితం మంగేశ్వరితో వివాహమైంది. తమ దంపతుల పేరు మీద తెల్ల రేషన్‌ కార్డు కోసం ఈ నెల 17న మీ సేవ కేంద్రంలో మంగేశ్వరి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును డీఎస్‌వో కార్యాలయానికి పంపేందుకు గొల్లపూడి వీఆర్‌వో కశ్యబ్‌, కం ప్యూటర్‌ ఆపరేటర్‌ గంజి సతీశ్‌లను మంగేశ్వరి భర్త వేణుకుమార్‌ కలిశారు. పని పూర్తికావాలంటే రూ.2 వేలు లంచం ఇవ్వాలని వీఆర్‌వో, కంప్యూటర్‌ ఆపరేటర్‌ డి మాండ్‌ చేశారు. ఏమాత్రం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉ న్నానని వేణుగోపాల్‌ చెప్పినప్పటికీ వినలేదు. చివరకు ‘దయతలిచి’ రూ.1500 వద్దకు దిగొచ్చారు. వారిద్దరి తీరుతో విసుగెత్తిన వేణుకుమార్‌.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆ లంచావతారులను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు పథకం వేశారు. వారి సూచనల ప్ర కారం.. కంప్యూటర్‌ ఆపరేటర్‌ గంజి సతీశ్‌కు బాధితు డు వేణుకుమార్‌ గురువారం రూ.1500 నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తరువాత వీఆర్‌వో కశ్యబ్‌ను, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సతీశ్‌ను అరెస్ట్‌ చేశారు. విచారణ అనంతరం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు అప్పగించేందుకు తరలించారు. ఈ దాడిలో ఏసీబీ వరంగల్‌ డీఎస్పీ, ఖమ్మం ఇంచార్జి డీఎస్పీ ఎ.మధుసూదన్‌, ఖమ్మం సీఐ రమణమూర్తి, ఎస్సైలు పాల్గొన్నారు.