బాలయ్య-బోయపాటి కాంబోలో సినిమా అంటే రికార్డ్ ల మోత మోగాల్సిందే. అలా ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న అఖండ సినిమా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఉగాది కానుకగా వచ్చిన ఈసినిమా టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
నిన్నటివరకు సీనియర్ హీరో చిరంజీవి ఆచార్య టీజర్ ఈ విషయంలో ముందుంటే ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసింది అఖండ. మెగాస్టార్ ని వెనక్కి నెట్టిన నందమూరి అఖండమైన వ్యూస్ తో రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మోషన్ పోస్టర్ పేరు మీద ఉన్న లెక్కను మార్చేశాడు.
ఇలా ఓకేసారి తండ్రీ కొడుకుల సినిమాల రికార్డ్ లను బాలయ్య ఒక్కడే అఖండ సినిమాతో బద్ధలు కొట్టాడు. అక్కడ వెండితెర మీద కపాలంపగిలిపోద్దని చెప్పిన బాలయ్య డైలాగ్ కి ఇక్కడ యూట్యూబ్ లో రికార్డ్ లన్నీ పగిలిపోతున్నాయని నందూమూరి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మే 28న బాలయ్య అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది.