శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 28, 2020 , 02:06:48

నిరుపేదల్లో ‘డబుల్‌' ఆనందం

నిరుపేదల్లో ‘డబుల్‌' ఆనందం

  •  బూర్గంపహాడ్‌ మండలంలో 76 మందికి ‘డబుల్‌' ఇళ్ల అందజేత
  • పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
  •  ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

బూర్గంపహాడ్‌: నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే సదుద్ధేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. బూర్గంపహాడ్‌ మండలంలోని ముసలిమడుగు, మోరంపల్లిబంజర గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 76 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను సోమవారం లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. సకల హంగులతో ఈ ఇళ్లను నిర్మించి ఇచ్చినట్లు చెప్పారు. లబ్ధిదారులు ఈ ఇళ్లను అమ్ముకోవద్దని, అలా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మండల ప్రత్యేకాధికారి చంద్రప్రకాష్‌, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్‌ కిషోర్‌, ఐటీడీఏ డీఈ రాములు, ఏఈ మౌనిక, సొసైటీ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీష్‌, సర్పంచ్‌లు దివ్యశ్రీ, వెంకటరమణ, తుపాకుల రామలక్ష్మి, భారతి, ఆర్‌ఐలు శంకర్‌, అక్బర్‌బాబు, టీఆర్‌ఎస్‌ నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, జక్కం సర్వేశ్వరరావు, గోనెల నాని, సాబీర్‌పాషా, మేడం లక్ష్మినారాయణరెడ్డి, బండారు లక్ష్మీనారాయణ, యుగేందర్‌రెడ్డి, కుర్సం వెంకన్న, తుపాకుల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

సొంత ఇల్లు లేక ఎన్నో అవస్థలు పడ్డాం. నిరుపేదలను గుర్తించి ఇలా డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని నిర్మించి అందించడం అభినందనీయం. సీఎం కేసీఆర్‌ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.

-కాకా లక్ష్మి, లబ్ధిదారురాలు, 

ముసలిమడుగు సకల హంగులతో నిర్మించి ఇచ్చారు

నిరుపేద కుటుంబంలో బతుకీడుస్తున్న మాకు సొంత ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. మా సొంతింటి కలను సీఎం కేసీఆర్‌ సార్‌ నిజం చేశారు. అన్ని సౌకర్యాలతో డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని నిర్మించి అందించారు. ఇదింతా కలాగా ఉంది. 

-వాసం నాగమణి, లబ్ధిదారురాలు