బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 28, 2020 , 01:53:53

భక్తి ప్రపత్తులతో సుదర్శన హోమం

భక్తి ప్రపత్తులతో సుదర్శన హోమం

  • రేపటి నుంచి భద్రాద్రిలో పవిత్రోత్సవాలు ప్రారంభం

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సోమవారం సుదర్శన హోమం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహావచనం, కంకణదారణ, అగ్ని ప్రతిష్ట, హోమం తదితర పూజలు నిర్వహించారు. అలాగే స్వామి వారికి నిత్య కల్యాణం సంప్రదాయంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా బుధవారం నుంచి రామాలయంలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలకు 29న అంకురార్పణ గావించారు. అలాగే 30న అష్టోత్తర శతకలశ వాహనం, అగ్ని ప్రతిష్ట, పవిత్రదాదివాసం నిర్వహించనున్నారు. 31న అష్టోత్తర శతకలశాభిషేకం, అగ్ని ప్రతిష్ట, పవిత్రాదివాసం నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని 30 నుంచి ఆగస్టు 3 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేయనున్నారు.