ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 26, 2020 , 07:50:38

ఆర్టీసీ కొరియర్‌ చార్జీలు తగ్గింపు: ఆర్టీసీ డీవీఎం

ఆర్టీసీ కొరియర్‌ చార్జీలు తగ్గింపు: ఆర్టీసీ డీవీఎం

కొత్తగూడెం అర్బన్‌: రాఖీ పండుగను పురస్కరించుకొని రాఖీలను ఆర్టీసీ కొరియర్‌, పార్సిల్‌లో అతి తక్కువ చార్జీలకు సర్వీస్‌ అందిస్తున్నామని డీవీఎం వేములవాడ శ్రీకృష్ణ శనివారం తెలిపారు. రాఖీ పండుగకు కరోనా వల్ల విఘాతం కలుగుకుండా ఉండేందుకు తక్కువ చార్జీలతో కొరియర్‌, పార్సిల్‌ సర్వీస్‌ ద్వారా అందించే సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. కొరియర్‌ చార్జీలు రూ.50ల నుంచి రూ.20కు, రూ.75ల నుంచి రూ.30కు, రూ.100 నుంచి 40కు తగ్గించామన్నారు. పార్సిల్‌ సర్వీస్‌ 5 కేజీల బరువు 75 కిలోమీటర్లకు రూ.80నుంచి రూ.40కు, 200 కిలో మీటర్లకు రూ.90 నుంచి రూ.45కు, 300 కిలోమీటర్లు రూ.105 నుంచి 50కు తగ్గించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు బస్టాండ్‌లోని కార్గో సెంటర్‌లో కానీ 7382857099, 7382858860 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.