శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 24, 2020 , 02:16:48

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని రామాలయం ముఖ ద్వారం వద్ద రాములోరి నిత్య కల్యా ణం గురువారం ఘ నంగా నిర్వహించారు. ముందుగా అర్చకస్వాములు విశ్వక్సేన, పుణ్యహావాచనం జరిపారు. కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

సాయిబాబాకు క్షీరాభిషేకం

భద్రాచలం : భద్రాచలంలోని సాయిబాబా ఆలయంలో గురువారం బాబాకు క్షీరాభిషేకం చేశారు. నూతన వస్ర్తాలు అలంకరించి పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసాదం నివేదన జరిపి హారతి పాడారు. పట్టణానికి చెందిన వీరభద్ర వరలక్ష్మి దంపతులు అన్న ప్రసాద పొట్లాలను వృద్ధులు, యాచకులకు పంపిణీ చేశారు. ఆలయంలో ప్రవేశించిన ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, శానిటేషన్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం సంధ్యహారతి పాదుక పూజ నిర్వహించారు.