శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 21, 2020 , 03:56:53

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పాల్వంచ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాల్వంచ పట్టణంలోని బస్టాండు రోడ్డులో సోమవారం ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలో విరివిగా పండ్ల మొక్కలను, నీడనిచ్చే మొక్కలను పెంచాలని కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, డీఈ మురళి, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వాణికుమారి, టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్‌, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు కిలారు నాగేశ్వరరావు, మల్లెల రవిచంద్ర, కాల్వ భాస్కర్‌, ప్రకాష్‌, దాసరి నాగేశ్వరరావు, బేతంశెట్టి విజయ్‌, కందుకూరి రాము, రమణమూర్తి నాయుడు, హర్ష, పప్పు సుబ్బారావు, చింతా నాగరాజు, అప్పారావు, పిలక రమేష్‌, సత్తెనపల్లి వెంకన్న పాల్గొన్నారు.