సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 20, 2020 , 04:55:04

కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత

కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత

  • 5వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

పాల్వంచ రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ నుంచి ఆదివారం రెండు గేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రెండు రోజుల నుంచి కిన్నెరసాని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌లో నీటిమట్టం 400 అడుగుల నుంచి ఆదివారం 404.4 అడుగులకు చేరింది. దీంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 407అడుగులు. కిన్నెరసాని పరివాహక ప్రాంతాల ప్రజలను డ్యామ్‌సైట్‌ అధికారులు సైరన్‌ మోగించి అప్రమత్తం చేశారు.