ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 17, 2020 , 04:09:44

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

టేకులపల్లి : ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయ సంఘం సభ్యులు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులకు 2020-2021 సంవత్సరానికి గాను రెన్యువల్‌ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వారు సీఎం కేసీఆర్‌, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియా నాయక్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సంఘం సభ్యులు గుగులోత్‌ వీరన్న మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 1950 మంది ఉపాధ్యాయులను రెన్యువల్‌ చేసిన కేసీఆర్‌కు, కృషి చేసిన మంత్రి సత్యవతి రాథోడ్‌కి, ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో నాయకులు జి.వీరన్న, బానోత్‌ మంగీలాల్‌, భూక్య కిరణ్‌, ఇస్లావత్‌ రవి, భూక్య మంగీలాల్‌, గుగులోత్‌ సక్రు, రవికుమార్‌, స్వామి, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.