బుధవారం 12 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 12, 2020 , 08:09:43

మెరుగైన వైద్యసేవలే ధ్యేయం

మెరుగైన వైద్యసేవలే ధ్యేయం

  • విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
  • కరకగూడెంలో 108 బైక్‌ 
  • అంబులెన్స్‌ సేవలు ప్రారంభం 

కరకగూడెం: ప్రజారోగ్యమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. కరకగూడెంలోని పీహెచ్‌సీ ప్రాంగణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి 108 బైక్‌ అంబులెన్స్‌ సేవలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాధారణ అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రాంతాల్లో తక్షణ వైద్య సాయం అందించేందుకు 108 బైక్‌ అంబులెన్స్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.  కాగా మరమ్మతుల కోసం డ్రిస్టిక్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) కింద కరకగూడెం పీహెచ్‌సీకి రూ.5లక్షలు, పినపాక పీహెచ్‌సీకి రూ. 3 లక్షలు, జానంపేట పీహెచ్‌సీకి రూ. 8 లక్షల నిధులు మంజూరైనట్లు విప్‌ రేగా తెలిపారు. నిధులు మంజూరు పట్ల పీహెచ్‌సీ వైద్యాధికారి పర్షియానాయక్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, వైస్‌ఎంపీపీ పటాన్‌ఆయుబ్‌ఖాన్‌, 108 జిల్లా కోఅర్డినేటర్‌ దుర్గప్రసాద్‌, ఉపసర్పంచ్‌ రావుల రవి, కోఆపరేటివ్‌ డైరెక్టర్‌ రావుల కనకయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హైమద్‌ హుస్సేన్‌, పార్టీ నాయకులు కొంపెల్లి పెదరామలింగం, రావుల సొమయ్య, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, రేగా సత్యనారాయణ, చినరామలింగం, సారా సాంబయ్య, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo