బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 10, 2020 , 03:21:51

ఇద్దరు ప్రత్యేక అధికారుల నియామకం: కలెక్టర్‌

ఇద్దరు ప్రత్యేక అధికారుల నియామకం: కలెక్టర్‌

కొత్తగూడెం: భద్రాద్రి కలెక్టరేట్‌ సిబ్బంది యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌ సిబ్బందికి ఇటీవల కరోనా నిర్ధారణ అయినందున ఇతర సిబ్బంది భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు, ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను తెలుసుకొని అధికారులకు తక్షణ సమాచారం అందించేందుకు కలెక్టరేట్‌ పర్యవేక్షకులు గన్యానాయక్‌, రంగాప్రసాద్‌ను నియమించినట్లు చెప్పారు. ప్రజలు 08744-246655, 7674809022 నంబర్లకు ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో కరోనా రోగులకు వైద్యం అందించేందుకు పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెంలలో చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.