శుక్రవారం 07 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 09, 2020 , 03:00:23

కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలోనే కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలోనే కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

కొత్తగూడెం: అందరినీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇక నుంచి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలోనే జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో టీబీ పరీక్షలు చేసే టెస్టింగ్‌ సెంటర్‌లోనే కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ కూడా ఏర్పాటవుతున్నది. ఇ క్కడ టీబీతోపాటు కరోనా పరీక్షలు కూడా చేస్తారు. ఇ ప్పటివరకూ కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్‌ ను హైదరాబాద్‌ పంపించేవారు. త్వరలో కొత్తగూ డెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనా పరీక్షలు చేస్తారు.

రెండు రోజుల్లో ప్రారంభం

ఈ కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ను మరో రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఇక్కడి టెక్నీషియన్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. పరీక్షలు చేసే సిబ్బందికి పీపీ కిట్లు కూడా సిద్ధమయ్యాయి. ఏసీ మిషనరీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ నిర్వహణ బాధ్యతలను టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌తో పాటు కొవిడ్‌-19 నోడల్‌ అధికారి డాక్టర్‌ వెంకన్న చూస్తారు. జిల్లాలో ఇప్పటికే 54 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోనే కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటవడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

   కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ను రెండు రోజుల క్రితం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి పరిశీలించారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారు.. వారికి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేశారు... ఇతరులకు వైరస్‌ వ్యాపించకుండా తీసుకుంటున్న జాగ్రత్త లు... తదితరాంశాలను డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ భా స్క ర్‌ నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేశ్‌ నుంచి తెలుసుకున్నారు. సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

కరోనా, టీబీ టెస్టులు ఒకేచోట...

ఇక నుంచి కొత్తగూడెం ఆసుపత్రిలోనే టీబీ, కరోనా టెస్టులు జరుగుతాయని అడిషనల్‌ డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాస్‌ చెప్పారు. “ఇక్కడే టెస్టిం గ్‌ సెంటర్‌ ఏర్పాటవ డం చాలా గొప్ప అవకాశం. ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తే రోగులకు ఊరటగా ఉంటుంది. హైదరాబాద్‌కు శాంపిల్‌ పంపించడం, అక్కడి నుంచి ఫలితం వచ్చేంత వరకు రోగితోపాటు కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆందోళనకు లోనయ్యేవారు. ఇక్కడే టెస్టింగ్‌ సెంటర్‌ ఉంటే... ఫలితం వెంటనే వస్తుంది. పాజిటివ్‌ వస్తే సత్వరమే క్వారంటైన్‌ చేసేందుకు అవకాశముంటుంది” అని వివరించారు.

ఖమ్మం నగరంలో మూడు కరోనా పాజిటివ్‌ 

మయూరిసెంటర్‌: ఖమ్మం నగరంలో బుధవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటి వివరాలను జి ల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.మాలతి హెల్త్‌ బులిటెన్‌ లో తెలిపారు. అందులోని వివరాలు... నగరంలోని శుక్రవారపేటలో ఓ యువతికి, నగరానికి చెందిన మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిని జిల్లా ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రానికి అధికారులు తరలించారు. ఇప్పటివరకు సేకరించిన 1553 శాంపిల్స్‌లో 1387 మందికి నెగెటివ్‌ వచ్చిందని, ఇంకా 86 రిపోర్టులు రావాల్సుంది. పాజిటివ్‌ వచ్చిన వారిలో 50 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 59 ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందారు.

కూసుమంచి మండలంలో తొలి కేసు...

కూసుమంచి రూరల్‌: కూసుమంచి మండలంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మండల వైద్యాధికారి తెలిపిన వివరాలు.. మండలంలోని చౌటపల్లికి చెందిన 24 ఏళ్ల యువకుడు ఖమ్మంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో పనిచేస్తున్నాడు. అతడు రోజూ వెళ్లి వస్తున్నాడు. అతడు అస్వస్థుడవడంతో ఖమ్మం ఆసుపత్రి వైద్యులు ఈ నెల 4న శాంపిల్స్‌ తీసి పరీక్షకు పంపించారు. ఈ నెల 6న వచ్చిన రిపోర్టులో అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడి తల్లిని అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. చౌటపల్లిలో బుధవారం పారిశుధ్య పనులు చేయించారు


logo