శుక్రవారం 07 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 09, 2020 , 02:57:03

గంజాయి గుట్టు రట్టు

గంజాయి గుట్టు రట్టు

  •  భద్రాద్రిలో రూ.40 లక్షల విలువైన సరుకు పట్టివేత
  • 266 కిలోలు బస్తాల్లో ప్యాక్‌  
  • కారులో అక్రమంగా తరలించేందుకు సిద్ధం
  • తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడిన వైనం

భద్రాచలం: భద్రాచలంలో బుధవారం రూ.40 లక్షల విలువైన గంజాయిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ వినోద్‌ తెలిపిన వివరాలు... పట్టణ ఎస్సై మహేష్‌ ఆధ్వర్యంలోని పోలీసులు బ్రిడ్జి పాయింట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడకు సమీపంలో ఆగి ఉన్న మారుతి ఎర్టిగా కారు(టీఎస్‌29బీ96బీ)ను  తనిఖీ చేశారు. అందులో గోనె బస్తాల్లో ప్యాక్‌ చేసిన గంజాయిని గమనించారు. కారు సహా ఆ గంజాయిని స్వాధీనపర్చుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ గంజాయి 266 కేజీలు ఉంది. దీని విలువ రూ.40 లక్షల వరకు ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.


logo