బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 06, 2020 , 04:47:41

రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్‌

రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్‌

  • వ్యవసాయ రంగంలో అగ్రభాగాన తెలంగాణ
  • జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు లింగాల, కూరాకుల 

ఎర్రుపాలెం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం పేర్కొన్నారు. మండలంలోని మీనవోలు, పెద్దగోపవరం సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పంట రుణాలు పంపిణీలో వారు మాట్లాడారు. రైతులకు తోడ్పాటు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని అన్నారు. పంటల పెట్టుబడి సమయంలో సహకార సంఘాల ద్వారా రుణాలు పంపిణీ చేయడం రైతులకు ఎంతో చేయూతనిచ్చినట్లు అవుతుందని అన్నారు. అనంతరం సొసైటీ ఆవరణలో మొక్కలు నాటారు. మధిర ఏఎంసీ చైర్మన్‌ చావా రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ చైర్మన్లు శీలం అక్కిరెడ్డి, కుడుముల మధుసూదన్‌రెడ్డి, అనుమోలు సాంబశివరావు, సర్పంచ్‌లు మొగిలి అప్పారావు, జంగా పుల్లారెడ్డి, వేమిరెడ్డి అనురాధ, ఇనపనూరి శివాజీ, ఎంపీటీసీలు సంక్రాంతి కృష్ణారావు, కుడుముల మల్లికార్జున్‌రెడ్డి, సగ్గుర్తి కిశోర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగ మండల అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి, మండల కార్యదర్శి వెంకటనారాయణ, నాయకులు పంబి సాంబశివరావు, సత్యనారాయణరెడ్డి, నీలం రవికుమార్‌, తల్లపురెడ్డి రామిరెడ్డి, శీలం పుల్లారెడ్డి, లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, బాణాల శ్రీనివాసరావు, వేమిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.