ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 06, 2020 , 04:45:39

నిరాడంబరంగా దమ్మక్క సేవాయాత్ర

నిరాడంబరంగా దమ్మక్క  సేవాయాత్ర

  • పొగడ చెట్టు ప్రాంగణంలో ప్రత్యేక పూజలు
  • దమ్మక్క చిత్రపటంతో గిరి ప్రదక్షిణ
  • ఆమె సేవలను కొనియాడిన అర్చకులు

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క సేవాయాత్రను ఆదివారం నిరాడంబరంగా నిర్వహించారు. ముందుగా రామాలయం ప్రాంగణంలో పొగడ చెట్టు వద్ద ఉన్న దమ్మక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో దమ్మక్కకు గిరిజనులు భక్తితో తాటిపండ్లు, ఇతర ఫలాలు, పూలు సమర్పించారు. అనంతరం దమ్మక్క చిత్రపటంతో బాజాభజంత్రీలు, సన్నాయి మేళాల సందడి నడుమ గిరిప్రదక్షణ నిర్వహించారు. అలాగే హరిత హోటల్‌ సమీపంలోని దమ్మక్క విగ్రహానికి, ముక్కోటి ద్వారం సమీపంలోని భక్తరామదాసు విగ్రహానికి, విస్తా కాంప్లెక్సు ఆవరణలోని తూము నరసింహరాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్‌, ఆలయ పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్‌, సాయిబాబా పాల్గొన్నారు.