సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 02, 2020 , 00:40:13

వైభవంగా తొలి ఏకాదశి పూజలు

 వైభవంగా తొలి ఏకాదశి పూజలు

భద్రాచలం : తొలి ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మూలవరులకు విశ్వక్సేన పూజ చేశారు.  అనంతరం స్వామి వారికి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. వేణుగోపాలస్వామి వారి ఆలయంలో  స్వామి వారికి పంచామృతాభిషేకాన్ని ఎవీఎల్‌ఎన్‌ ఆచార్యుల నేతృత్వంలో నిర్వహించారు.