శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 02, 2020 , 00:34:35

పరిశ్రమల్లో కొవిడ్ని బంధనలు పాటించాలి

పరిశ్రమల్లో కొవిడ్ని బంధనలు పాటించాలి

  • భద్రాద్రి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం : పరిశ్రమల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని పరిశ్రమఅలఅ ప్రధాన అధికారులతో కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు, హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో సిబ్బందికి సెలవుల మంజూరు విషయంలో నియంత్రణ పాటించాలన్నారు. ఒకవేళ సెలవులపై ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తే కచ్చితంగా 17 రోజుల హోం క్వారంటైన్‌ పాటించేలా అధికారులు చూడాలన్నారు. కొన్నిచోట్ల స్క్రీనింగ్‌ చేయకుండానే సిబ్బందిని అనుమతిస్తున్నట్లు గమనించామని, పరిశ్రమల్లో వ్యాధి నియంత్రణ చర్యలు తనిఖీ కోసం అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాధి నియంత్రణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని ఆయన హెచ్చరించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను తొలగించడం, పడిపోయే దశలో ఉన్న చెట్లును తొలగించడంతో పాటు విద్యుత్‌ సమస్యలు, అగ్ని ప్రమాదాలు తదితరమైన వాటి నుంచి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మాస్కులు ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో కానీ శానిటైజర్‌తో కానీ శుభ్రం చేస్తుండాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ మేనేజర్‌ సీతారాం, డీఆర్‌వో అశోక చక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, వివిధ పరిశ్రమల ప్రధాన అధికారులు పాల్గొన్నారు.