బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 02, 2020 , 00:23:56

వైద్యుల సేవలు అభినందనీయం : కలెక్టర్‌

వైద్యుల సేవలు అభినందనీయం : కలెక్టర్‌

కొత్తగూడెం: ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డాక్టర్స్‌ డేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మానవాళి జీవితాలతో కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు కరాళనృత్యం చేస్తున్నా మొక్కవోని దీక్షతో ప్రాణహానిని సైతం లెక్కచేయకుండా నిరంతర సేవలతో ప్రజలను కాపాడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే సైనికులు వైద్యులని అన్నారు. వైద్య వృత్తి సమాజంలో ఎంతో గౌరవం ఉందని, ఏ సమయంలోనైనా సేవలందించే డాక్టర్లను ప్రస్తుత తరుణంలో ఎంతో గౌరవంగా చూడాలన్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్‌వో అశోక చక్రవర్తి, డీపీఆర్‌వో శ్రీనివాసరావు పాల్గొన్నారు.