ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 02, 2020 , 00:21:19

కార్మికులకు అండగా ఉంటాం

కార్మికులకు అండగా ఉంటాం

కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కార్మికులకు టీఆర్‌ఎస్‌  అండగా ఉంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డైరెక్టర్‌ (పా) చంద్రశేఖర్‌తో కలిసి మాట్లాడారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే-7 షాఫ్ట్‌ను మూసివేస్తున్నందున గనిలో పనిచేస్తున్న కార్మికుల్లో కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్‌లలో 90 శాతం మందిని సర్దుబాటు చేస్తున్నామన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌ నాయకుల కృషి మేరకు డైరెక్టర్‌ (పా) చంద్రశేఖర్‌ సీఎండీ శ్రీధర్‌తో చర్చించి కార్మికులను ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా ఇక్కడే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టారన్నారు. జీఎం (ఐఈడీ) సురేశ్‌బాబు, టీబీజీకేఎస్‌ ఏరియా, కార్పొరేట్‌ అధ్యక్షుడు రజాక్‌, సోమిరెడ్డి, 11మెన్‌ కమిటీ సభ్యుడు కాపు కృష్ణ, కూసన వీరభద్రం, బోరింగ్‌ శంకర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, టీబీజీకేఎస్‌ నాయకులు మోరె రమేశ్‌కుమార్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వేల్పుల దామోదర్‌, తదితరులు పాల్గొన్నారు.