సోమవారం 06 జూలై 2020
Badradri-kothagudem - Jun 30, 2020 , 04:42:59

ఆరోగ్య తెలంగాణే కేసీఆర్‌ లక్ష్యం

ఆరోగ్య తెలంగాణే కేసీఆర్‌ లక్ష్యం

  • వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌

వైరా: ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన అనారోగ్య బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. మొత్తం 13మంది లబ్ధిదారులకు రూ.1,83,500 చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, వైరా మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, లయన్స్‌క్లబ్‌ ఫాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ కాపా మురళీకృష్ణ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు దార్న రాజశేఖర్‌, కౌన్సిలర్లు చల్లగుండ్ల నాగేశ్వరరావు, దనేకుల వేణు, నాయకులు ఏదునూరి శ్రీను, చల్లా సతీశ్‌, సాదం రామారావు, రేచర్ల శ్రీను, బీక్యా, కొరివి నర్సింహారావు, మోటపోతుల సురేశ్‌, దొంతా నర్సింహారావు, బండారు తిరుపతిరావు పాల్గొన్నారు. logo