గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 29, 2020 , 02:28:28

పార్లమెంట్‌లో పీవీ చిత్రపటం పెట్టాలని కోరుతాం: నామా

పార్లమెంట్‌లో పీవీ చిత్రపటం పెట్టాలని కోరుతాం: నామా

ఖమ్మం: సంస్కరణలతో దేశ గతిని మార్చిన పీవీ నర్సింహారావును సమాజం ఎప్పటికే మర్చిపోలేదని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పూర్వ ప్రధాని పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దార్శనికుడిగా పేరుపొందిన పీవీ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టాలని కోరుతామని అన్నారు. పీవీని చిరస్మరణీయంగా నిలిపేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు.