ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 27, 2020 , 02:37:24

సొంతింటి కలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్‌

సొంతింటి కలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్‌

  • పైసా ఖర్చులేకుండా గృహప్రవేశాలు చేయిస్తున్న ప్రభుత్వం
  • ‘హరితహారం’.. తెలంగాణకు మణిహారం
  •  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ‘డబుల్‌' ఇండ్లు ప్రారంభం
  • భద్రాచలం, సారపాకలో మొక్కలు నాటిన మంత్రి 

“నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోంది.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డబుల్‌ ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందిస్తున్నారు.. పైసా ఖర్చులేకుండా ప్రభుత్వమే గృహప్రవేశాలు   చేయిస్తోంది..” అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి   పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం        భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన చర్ల, దుమ్ముగూడెంలో ప్రభుత్వ విప్‌ రేగా, మహబూబాబాద్‌ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ బాలసానితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాలనీ, ఆర్‌కొత్తగూడెం, మహదేవపురంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ డబుల్‌ ఇండ్లు నిర్మించి ఇస్తున్నదన్నారు. ఏజెన్సీలో గిరిజనుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. తానూ ఈ ప్రాంతం వాడినేనంటూ చిన్ననాటి జ్ఞాపకాలను మంత్రి నెమరువేసుకున్నారు.      -చర్ల రూరల్‌/దుమ్ముగూడెం

దుమ్ముగూడెం: రాష్ట్రంలో ఏజెన్సీ మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం దుమ్ముగూడెం మండల పర్యటనలో భాగంగా మహదేవపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్యే వీరయ్య, కలెక్టర్‌ ఎంవీ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతువేదికకు శంకుస్థాపన చేసి తూరుబాకలో రూ.10లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని, మారేడుబాకలో రూ.20లక్షలతో నిర్మించిన పీహెచ్‌సీని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో రైతువేదికల నిర్మాణాలు చేపట్టేందుకు భూమిని కేటాయించామని, రానున్న మూడు నెలల్లో రైతువేదికలు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం వెంకట్రావు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీడీవో బైరవ మల్లేశ్వరి, తహసీల్దార్‌ రాంనరేశ్‌, భద్రాచలం, చర్ల మార్కెట్‌కమిటీ చైర్మన్లు బూరం నాగజ్యోతి, బోదెబోయిన బుచ్చయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధికార ప్రతినిధి జానీపాషా, మండల రైతుబంధు అధ్యక్షుడు బత్తుల శోభన్‌బాబు, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ లక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి తోట రమేశ్‌, సర్పంచ్‌లు, పంచాయతీరాజ్‌, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.

లక్ష్మీకాలనీ, ఆర్‌. కొత్తగూడెంలో..

చర్ల రూరల్‌ : మండల పరిధిలోని లక్ష్మీకాలనీలో 40, ఆర్‌. కొత్తగూడెంలో 40 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు మంత్రికి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చర్ల మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ కాపుల కృష్ణార్జునరావు, సొసైటీ డైరెక్టర్లు ముమ్మినేని అరవింద్‌, రాధాకృష్ణ, మండల నాయకులు తడికల లాలయ్య, తోటమళ్ల వరప్రసాద్‌, కాకి అనిత్‌, పంజా రాజు, కొప్పినీడు బాబూరావు, రాజబాబు, నక్కిబోయిన శ్రీనివాసయాదవ్‌, ఎంపీటీసీ జయమ్మ  పాల్గొన్నారు.

రహదారులను ప్రారంభించిన మంత్రి

పర్ణశాల: మండలంలోని పెద్దనల్లబల్లిలో రూ.9కోట్లతో నిర్మించిన పెద్దనల్లబల్లి-పైడిగూడెం రహదారి, రూ.2.80 కోట్లతో నిర్మించిన గౌరారం వద్ద నూతన బ్రిడ్జిని మంత్రి అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం చిన్ననల్లబల్లి-జిన్నెలగూడెం 6 కిలోమీటర్ల మేర రూ.8.40కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం రహదారి పక్కన మొక్క నాటారు. పెద్దనల్లబల్లి, గౌరారం, చిన్ననల్లబెల్లి సర్పంచ్‌లు శివాజీ, జ్యోతి, జయ, రైతుబంధు సమితి అధ్యక్షుడు బత్తుల శోభన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, కొత్తూరు సీతారామారావు, ఎండీ అలీమ్‌ఖాన్‌, కెల్లా శేఖర్‌ పాల్గొన్నారు.

మూడు నెలల్లో సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తిచేయాలి

జూలూరుపాడు: ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు నూతనంగా మంజూరైన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి విద్యుత్‌ సరఫరా చేయాలని  మంత్రి అజయ్‌కుమార్‌ కోరారు. మండల పరిధి పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని పుట్టకోట-అన్నారుపాడు గ్రామాల మధ్య రూ.1.20లక్షలతో నిర్మించే సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. 

చర్ల పీహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి..

చర్ల : ఐటీడీఏ ఆధ్యర్యంలో ఎల్‌డబ్ల్యూఈ నిధులతో  మండలంలోని కొయ్యూరులో రూ. 68లక్షలతో నిర్మించిన పీహెచ్‌సీ భవనం, రూ.25 లక్షలతో నిర్మించిన పది పడకల భవనం, రూ.26 లక్షలతో నిర్మించిన భవన సముదాయాన్ని మంత్రి అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. తాను అన్నివేళలా ప్రజలకు అందుబాటు ఉంటానని అన్నారు. ఎంపీపీ కోదండరామయ్య, జడ్పీటీసీ శాంత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.