మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 26, 2020 , 01:33:53

హరిత తెలంగాణే సీఎం లక్ష్యం

హరిత తెలంగాణే సీఎం లక్ష్యం

  • సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

కల్లూరు:  హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ర్టాన్ని పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర య్య అన్నారు. గురువారం మండల పరిధి పడమటి లోకవరంలో పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అప్పుడే సీఎం కేసీఆర్‌ కల సాకారమవుతుందన్నారు. అనంతరం పద్మశ్రీ వనజీవి రామయ్య మాట్లాడుతూ అడవుల నరికివేత, క్షీణించడమే అనేక అనర్థాలకు మూలమని అన్నారు. అనంతరం వనజీవి దంపతులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఆర్డీవో సూర్యనారాయణ, సర్పంచ్‌ కొండలరావు, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు, డీఎఫ్‌వో సతీశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం 

పెనుబల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతమైన ఆలోచనల్లోనుంచి పుట్టిన హరితహారం కార్యక్రమంతో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా  నిలుస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అ న్నారు. గురువారం పెనుబల్లి మండలం అడవిమల్లేలలో 500 మొక్కలను పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులతో కలిసి ఆయన మొక్క నాటి అనంతరం మాట్లాడారు.