శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 24, 2020 , 00:42:41

టేకు, చింత మొక్కలకు ప్రాధాన్యం

టేకు, చింత మొక్కలకు ప్రాధాన్యం

  • భవిష్యత్‌ అవసరాల కోసమే..
  • నాటేందుకు మొక్కలు సిద్ధం 

కొత్తగూడెం అర్బన్‌ : గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో ఉట్టి పడాలని, అడవులను పెంచాలని, వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు తెలంగాణ ప్రభు త్వం ‘హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ంది. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యతను సైతం అధికారులు తీసుకోవాలని, తద్వా రా ప్రపంచంలోనే రాష్ట్రం పచ్చదనంలో మేటిగా నిలవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా 5 విడతలుగా కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీనుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారం భం కానుంది.  ఇందులో పూలు, పండ్లు, నీడనిచ్చే,  మన నిత్యజీవితంలో ఉపయోగపడి, అవసరాలు తీర్చే మొక్కలను కూడా నాటాలని భావించింది. 

హరితహారానికి రెడీ..

ఈ ఏడాది నుంచి చింత మొక్కలను అధికంగా నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్‌లో చింతపండు రేటు అధికంగా పెరగడం, భవిష్యత్‌లో మరింతగా ఇబ్బందిపడే అవకాశముందని గ్రహించిన సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ఆరో విడత హరితహారంలో చెరువుగట్లపై, పొలంగట్లపై, ఖాళీ ప్రదేశాల్లో చింతమొక్కలు నాటాలని నాటాలని ఆదేశించారు.  భూకాలుష్యాన్ని సైతం నిరోధించే అధిక లక్షణాలు చింతచెట్లలో ఉన్నాయి. టేకు వృక్ష జాతి అంతరించిపోయే దశలో ఉంది. గృహ, ఫర్నీచర్‌ అవసరాలతో పాటు, ఎక్కువ విలువ ఉండటంతో ఈ మొక్కలు నాటేలా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మొక్కలు నాటితే భవిష్యత్‌లో  కలపకు ఇబ్బందులు ఉండవు. 

జిల్లా వ్యాప్తంగా అధికారులు 3.59లక్షల చింతమొక్కలు నాటనున్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 2,43,278, ఇతర శాఖల ఆధ్వర్యంలో  కొత్తగూడెంలో  5వేలు, పాల్వంచలో 62,300, మణుగూరులో 24వేలు, భద్రాచలంలో 11,920, కిన్నెరసానీ అభయారణ్యంలో 12,977 నాటాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 17,81,122టేకు మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 15,37,913 టేకుమొక్క లు, కొత్తగూడెంలో 67,089, ఇల్లెందులో 31వేలు, పాల్వంచలో 30,400, మణుగూరులో 37వేలు, భద్రాచలంలో 66,720, కిన్నెరసానీ అభయారణ్యంలో 11వేలు నాటాలని సిద్ధం చేశారు.