శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 24, 2020 , 00:06:50

హరితహారాన్ని విజయవంతం చేయాలి

హరితహారాన్ని విజయవంతం చేయాలి

  • కొత్తగూడెం అభివృద్ధే  ధ్యేయం 
  • ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు 

కొత్తగూడెం జూన్‌ 23 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కలు మానవ మనుగడకు దోహదపడతాయని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు.

రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.  కొత్తగూడెం నియోజకవర్గంలో ఐదులక్షల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన వంతుగా కూడా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.  హరితహారంతో పాటు పరిశుభ్రత గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  రూ. 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నానని అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గానికి అధిక నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్‌ చైర్మన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ దామోదర్‌, జెడ్పీటీసీ బిందు చౌహాన్‌, ఎంపీపీలు సోనా, శాంతి, విజయలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.