మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 23, 2020 , 00:42:54

మంత్రి పర్యటనను విజయవంతం చేయండి

మంత్రి పర్యటనను విజయవంతం చేయండి

భద్రాచలం: ఈనెల 26న భద్రాచలం డివిజన్‌లో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యటిస్తారని, పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. సోమవారం భద్రాచలం వచ్చిన ఎమ్మె ల్సీ దత్తా రెసిడెన్సీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మా ట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ భద్రాచలం, దుమ్ముగూడెం  మండలాల అధ్యక్షులు యశోద నగేశ్‌, అన్నెం సత్యాలు, చర్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ పరుచూరి రవికుమార్‌, వెంకటాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోదెబోయిన బుచ్చయ్య, ఎంపీపీ శాంతమ్మ, కొండిశెట్టి కృష్ణమూర్తి, భూక్య శ్వేత, పడిసిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

దుమ్ముగూడెం..

ఈనెల 26న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మండలంలో పర్యటించి రైతు వేదికలకు శంకుస్థాపన, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం మండలంలోని నర్సాపురం, మహాదేవపురం గ్రామాల్లోని రైతువేదిక స్థలాలను, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ తెల్లం వెంకట్రా వు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అన్నెం సత్యమూర్తి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీటీసీ రేసు లక్ష్మి, రైతు బంధు సమితి మండల  అధ్యక్షుడు బత్తుల శోభన్‌బాబు, తహసీల్దార్‌ రాంనరేశ్‌, ఎంపీడీవో బైరవ మల్లేశ్వరి, సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రామారావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సూర్యచందర్‌రావు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శివరామకృష్ణ, సర్పంచ్‌లు సుమిత్ర,  సీతారామయ్య, చంద్రశేఖర్‌, ఎంపీటీసీ రామారావు, సహకార సంఘం డైరెక్టర్‌ వెంకట్రావు, ఉపసర్పంచ్‌ మణేశ్వరరావు, నాయకులు లక్ష్మణ్‌, సీతయ్య, రమేశ్‌, ముత్తయ్య పాల్గొన్నారు.

చర్ల రూరల్‌..

ఈనెల 26న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తొలిసారి చర్ల మండల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సోమవారం మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గోగుబాక గ్రామం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు బాలసానికి స్వాగతం పలికారు.  కార్యక్రమంలో ఆర్‌టీఏ డైరెక్టర్‌ గూడపాటి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, చర్ల ఏఎంసీ చైర్మన్‌ బోదెబోయిన బుచ్చయ్య, ఎంపీడీవో నారాయణ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో చైతన్య, చర్ల మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ కాపుల కృష్ణార్జునరావు, కార్యదర్శి కృష్ణ, ఎంపీటీసీలు ఎట్టి జయమ్మ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.