సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 22, 2020 , 01:09:57

వీడిన గ్రహణం.. తెరుచుకున్న రామాలయం

వీడిన గ్రహణం..   తెరుచుకున్న రామాలయం

భద్రాచలం/పర్ణశాల : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో రామాలయం తలుపులను ఆదివారం మధ్యాహ్నం తెరిచారు. సూర్యగ్రహణం నేపథ్యంలో శనివారం రాత్రి ఆలయ తలుపులు మూసివేసిన విషయం విదితమే. కాగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచారు. గోదావరి నది నుంచి పుణ్య తీర్థాలను తీసుకొచ్చిన అర్చకస్వాములు ఆలయ సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ సిబ్బంది రామాలయ పరిసరాలను నీటితో శుభ్రపరిచి ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అనంతరం గర్భగుడి తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. భద్రాచలం రామాలయం అనుబంధ క్షేత్రం పర్ణశాల రామాలయంలో ఆలయ అర్చకులు నర్సింహాచార్యులు సంప్రోక్షణ, ఆలయ శుద్ధి చేసి ఆలయ తలుపులు తెరిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు దేవాలయాల్లో గ్రహణం అనంతరం ఆలయ అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.