మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jun 21, 2020 , 01:33:33

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం : విప్‌ రేగా

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం : విప్‌  రేగా

మణుగూరు : అన్ని వర్గాల రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.   స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయంలో శనివారం రైతులకు రుణాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారన్నారు.  రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ఎండకాలంలో కూడా చెరువులు అలుగు పోస్తున్నాయన్నారు. జిల్లాలో 60 రైతు వేదికలు నిర్మిస్తున్నారని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు.  కార్యక్రమంలో  జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ కేవీ రావు,  దొబ్బల వెంకటప్పయ్య,  దొండేటి రాంమ్మోహన్‌రావు, నాయకులు ముత్యంబాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్‌, తాళ్లపల్లి యాదగిరిగౌడ్‌, జావీద్‌పాష, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీను, జీవీ, ప్రభుదాసు, హర్షవర్ధన్‌, రుద్ర వెంకట్‌, తుపూడి శ్రీను, రమణ, నైనారపు నాగేశ్వరరావు, చంద్రకళ, డీసీసీబీ మేనేజర్‌ బాలరాజు, సర్పంచ్‌ బచ్చల బారతి, సీఈవో జ్ఞాన్‌దాసు, డైరెక్టర్లు మాధవి, సీతారాములు, నాగేశ్వరరావు,ఎంపీటీసీ సభ్యులు జి. కోటేశ్వరరావు, కనితి బాబురావు పాల్గొన్నారు. 

నిబంధనలు పాటించాలి...:  కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు ప్రభుత్వ నిబంధనలు  పాటించాలని  ప్రభుత్వ విప్‌,  ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.  ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు.    

ప్రజలు  అప్రమత్తంగా ఉండాలి

బూర్గంపహాడ్‌ : బూర్గంపహాడ్‌లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి జ్యూయలరీ షాపు నిర్వహిస్తున్న క్రమంలో ఆ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని మండల ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలుంటే  స్థానిక వైద్యులను సంప్రదించాలని, ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ, మాస్క్‌ ధరించాలన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సహాయం కావాలన్నా  తానుఅందుబాటులో ఉంటానని, ప్రభుత్వం కూడా అన్నిరకాల వైద్య సహకారం అందిస్తుందన్నారు.  

ఐటీసీ సేవలు మరువలేనివి   : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సారపాక ఐటీసీ పరిశ్రమ నిరుపేదలు, గిరిజనులకు అందిస్తున్న సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం మండల పరిధి  కృష్ణసాగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఐటీసీ యాజమాన్యం ఏర్పాటు చేసిన గిరిజనులకు నిత్యావసరాల పంపిణీలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించామన్నారు. ఐటీసీ సీఈవో సంజయ్‌సింగ్‌, యూనిట్‌ హెడ్‌ మకరంద్‌, జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌) ప్రబోద్‌కుమార్‌ పాత్రో, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఐటీసీ అడ్మిన్‌ మేనేజర్‌ చెంగల్‌రావు, సర్పంచ్‌ కె.వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ గోవింద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీశ్‌, ఎంపీటీసీలు సరిత, వంశీకృష్ణ, భిక్షపతి, లక్ష్మిపురం సర్పంచ్‌ సోంపాక నాగమణి, టీఆర్‌ఎస్‌ నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, మేడం లక్ష్మినారాయణ, బెల్లంకొండ మోహనరావు, ఐటీసీ కాంట్రాక్టర్లు పాకాల దుర్గాప్రసాద్‌, జలగం చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.