గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 18, 2020 , 02:58:21

నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన

నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఖమ్మం నుంచి బయల్దేరుతారు. 10.30 గంటలకు సుజాతనగర్‌ మండల కేంద్రానికి చేరుకుని జిల్లా పరిషత్‌ ఉన్నత ప్రహరీ నిర్మాణానికి, రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు వేపలగడ్డలో ఆర్‌వోబీ వంతెన, రహదారుల నిర్మాణాలకు భూమిపూజ, మధ్యాహ్నం 12 గంటలకు పాతకొత్తగూడెంలోని తెలంగాణ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో అడ్మిషన్‌ బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్తగూడేనికి చేరుకుంటారు. 2 గంటలకు బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 2.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయల్దేరతారు.

20న భద్రాద్రి రామాలయం మూసివేత

భద్రాచలం: సూర్యగ్రహణం సందర్భంగా 20వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటల వరకు భద్రాద్రి రామలయ తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జి.నర్సింహులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ చేసి ఆలయ తలుపులు తెరుస్తామన్నారు.