శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 16, 2020 , 03:13:08

సహజ వనరుల వినియోగంతోనే ఆర్థికాభివృద్ధి

సహజ వనరుల వినియోగంతోనే ఆర్థికాభివృద్ధి

  • ఇసుక రీచ్‌లతో  గిరిజనులకు ఆదాయం
  • భద్రాద్రిలో కొత్తగా తొమ్మిది రీచ్‌లు
  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి  పువ్వాడ అజయ్‌కుమార్‌
  • హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్‌ రేగా, ఎమ్మెల్సీ బాలసానితో సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నో సహజ ననరులు ఉన్నాయని, వాటిని సరైన రీతిలో వినియోగించుకొని స్థానికంగా ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక రీచ్‌ల వినియోగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్సుర్‌, భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొని చర్చించారు. కొత్తగా జిల్లాలో 9 ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అంశం చర్చకు వచ్చింది. గోదావరి నదీప్రాంతంలో 9 రీచ్‌లు ఉన్నాయని, సరైన ప్రణాళికతో వాడుకుంటే జిల్లాలో ఇసుక కొరతను నివారించవచ్చని సూచించారు.

ఇసుక మైనింగ్‌ ఎక్కువగా చేయాలని, తద్వారా ట్రైబల్‌ యువత బాగుపడుతుందని, వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారమవుతామన్నారు. యాక్షన్‌ప్లాన్‌ రూపొందించుకొని మైనింగ్‌ చేపట్టే చర్లు తీసుకోవాలని సూచించారు. ఇసుక ఎంత వరకు అవసరమో అంచనా వేయాలని, అందులో వేబ్రిడ్జిలు, ఎన్ని ఉన్నాయో చూసి వాటి ప్రకారం యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిచాలని చెప్పారు. లోకల్‌గా ట్రైబల్‌ సొసైటీలను ఏర్పాటుచేసి సహజ వనరులను వినయోగించుకోవడం ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపర్చగలమన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ అనుమతులు తీసుకొని ఇసుక మైనింగ్‌ చేపడితే జిల్లాలో ఇసుక కొరత ఉండదన్నారు.