గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 08, 2020 , 02:43:15

పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

సత్తుపల్లి రూరల్‌ : ప్రతి పల్లెను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రేజర్ల గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ప్రతి పల్లెను మట్టి రోడ్డు లేని బీటీ రోడ్డుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఆత్మచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సర్పంచ్‌ జక్కుల ప్రభాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఎంపీడీవో చిట్యాల సుభాషిణి, ఎంపీవో జ్యోత్స్నాదేవి, నాయకులు గోపాలరెడ్డి, సత్యనారాయణరెడ్డి  పాల్గొన్నారు.