మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 07, 2020 , 00:14:12

రేపటి నుంచి రామయ్య దర్శనం

రేపటి నుంచి రామయ్య దర్శనం

  • 80 రోజుల తర్వాత తెరుచుకోనున్న రామాలయం
  • ఆలయ పరిశుభ్రతకు దేవస్థానం శ్రీకారం
  • కొవిడ్‌ నిబంధనల మేరకే భక్తులకు ప్రవేశం
  • భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌
  • మాస్క్‌లు, శానిటైజర్లు సిద్ధం..

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం సన్నిధిలో సోమవారం నుంచి భక్తులకు రామయ్య దర్శనం కల్పించనున్నారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20 నుంచి దర్శనాలు నిలిచిపోయాయి. అనంతరం మళ్లీ రేపటినుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు.  అడుగుల దూరం పాటించేలా ఆలయ పరిసరాల్లో బారికేడింగ్‌, మార్కింగ్‌ చేస్తున్నారు. రామాలయ పరిసరాలను శనివారం నీటితో కడిగి శుభ్రం చేశారు. మాస్కులు, శానిటైజర్లు  దేవస్థానం కొనుగోలు చేసింది. ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పక పాటించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి నర్సింహులు ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి సూచించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ చర్యలు  పర్ణశాలలో కూడా కొవిడ్‌ నిబంధనలు అనుసరించి భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నారు. భద్రాచలంలోని వివిధ ఆలయాల్లో కూడా ఇదే పద్ధతి పాటించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. 

నేత్రపర్వంగా రామయ్య నిత్య కల్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శనివారం రామయ్య నిత్య కల్యాణం ఘనంగా నిర్వహించారు. రామాలయం ముఖ ద్వారం వద్ద నిర్వహించిన ఈ వేడుకలో ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం జరిపారు. కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు.