గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 05, 2020 , 02:08:44

అట‌వీ ఉత్ప‌త్తుల‌కు గిరాకీ

అట‌వీ ఉత్ప‌త్తుల‌కు గిరాకీ

  • రేట్లు పెంచిన గిరిజన సహకార సంస్థ.. 
  •  జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభం..
  • ఆదాయ మార్గాలపై జీసీసీ అన్వేషణ

భద్రాచలం: భద్రాద్రి ఏజెన్సీలో గిరిజనులు ఎక్కువగా అటవీ ఉత్పత్తులు విక్రయించి ఉపాధి పొందుతుంటారు. గతంలో  ఇవి విరివిగా లభించేవి. క్రమేపీ అడవులు తగ్గిపోవడంతో ఉత్పత్తులపై  ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అడవుల సంరక్షణకు చర్య లు మొదలయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో అటవీ విస్తీర్ణం పెరిగింది. అటవీ ఉత్పత్తులు కూడా అమాంతం  పెరిగాయి. వీటిని సేకరించేందుకు జీసీసీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ఏడాది రేట్లు కూడా పెంచింది.

గిరిజనులు అడవిలో లభించే అనేక ఉత్పత్తులను సేకరిస్తుంటారు. జిగురుతో పాటు విప్పపువ్వు, ఉసిరి, తేనె, చిల్లగింజలు తదితర ఉత్పత్తులను సేకరించి వాటిని విక్రయిస్తారు. ఈ ఏడాది రేట్లను పెంచి ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తున్నది.జిగురు గతంలో కిలో రూ.108 ఉండగా ప్రస్తుతం రూ.114కి పెంచారు. అలాగే విప్పపువ్వు రూ.17 నుంచి రూ.30 వరకు విప్ప పలుకు రూ.20 నుంచి రూ.29కి , కుం కుడు కాయలు రూ.8 నుంచి రూ.14కు, ఎండు ఉసిరిపప్పు రూ.45 నుంచి రూ.52, అడవి తేనె రూ.192 నుంచి రూ.225 వరకు, చిల్లగింజలు రూ.9 నుంచి రూ.12 రేట్లను పెంచారు.

 ఇవే కాకుండా గచ్చకాయలు, నల్లజీడి గింజలు, నరమామిడి చెక్క, కానుగ గింజలు, చింతపండు, ఎండు ఉసిరి పప్పు, తేనె మైనం, మారేడుగడ్డలు, చీపుర్లు, కరక్కాయలు తదితర వాటిని జీసీసీ కొనుగోలు చేస్తున్నది. గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్‌ సంఘాలు కొనుగోలు చేస్తున్నా యి. జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన నిత్యావసర వస్తు విక్రయ కేంద్రాల వద్ద కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ పెంచిన ధరలు కూడా అమలుల్లోకి వచ్చాయి. ప్రస్తుతం విప్పపువ్వు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జూలై వరకు వీటి కొనుగోళ్లు జరుగుతాయి. తర్వాత విప్పపలుకును కొనుగోలు చేయనున్నారు.

ఆదాయ మార్గాలపై దృష్టి.. 

అటవీ ఉత్పత్తుల సేకరణ మాత్రమే కాకుండా ఇతర ఆదాయ మార్గాలపై కూడా జీసీసీ దృష్టి సారించింది. ఇప్పటికే గిరిజన సహకార సంస్థ పెట్రోలు బంకుల నిర్వహణ, కారం మిల్లుల ఏర్పాటు, సబ్బులు, మాస్కుల తయారీ, దుకాణాలను నిర్వహిస్తున్నది.ములకలపల్లి, గుండాలలో ప్రస్తుతం జీసీసీ ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు నడుస్తున్నాయి. భద్రాచలంలో కూడా పెట్రోలు బంకు ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 అన్నపు రెడ్డిపల్లి, ద మ్మపేటలో నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మణుగూరులో  బంకుకు సం బంధించి రెవె న్యూ పరమైన ఇక్కట్లు తొలగిపోయాయి. ఈ విషయం లో భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ ప్రత్యేక చొరవ చూపారు. భద్రాచలం పట్టణంలో జీసీసీ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల నిర్వహణలో సబ్బులు, షాంపులు శానిటైజర్‌, మాస్కుల తయారీ జరుగుతున్నది.

అటవీ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి

కుంజా వాణి, జీసీసీ డీఎం, భద్రాచలం

అటవీ ఉత్పత్తుల సేకరణను ప్రోత్సహిస్తు న్నాం. ఆదివాసీలు సేకరించిన ఉత్పత్తులను జీసీసీ ఆధ్వర్యం లో కొనుగోలు చేస్తున్నాం. రేట్లు  పెంచాం. ఈ అవకాశాన్ని గిరిజనులు, ఇతర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు వివిధ ఆదాయ మార్గాల కోసం ప్రజలకు  ఉపయోగపడే వ్యాపార రంగాలను ప్రోత్సహిస్తున్నాం.