శుక్రవారం 03 జూలై 2020
Badradri-kothagudem - Jun 05, 2020 , 01:57:07

భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ

భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేకానికి  అంకురార్పణ

భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ జరిగింది. అర్చకులు గోదావరి తీర్థ బిందెతో జలాన్ని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 81 గంగాళాలతో స్వామి వారికి పూజలు నిర్వహించనున్నారు. అలాగే స్వామి వారికి దేవస్థాన సన్నిధిలో  నిత్యకల్యాణం నిర్వహించారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన నిర్వహించారు. స్వామి వారికి ఆభరణాలు ధరింపజేసి కల్యాణ తతంగాన్ని శాస్ర్తోక్తంగా జరిపించారు. కొద్ది రోజులుగా రామాలయంలో భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి. నిత్య కల్యాణాలు కూడా తొలుత నిలిపివేసి ఇటీవల తిరిగి పునరుద్ధ్దరించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు తమ గోత్ర నామాలతో ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. 


logo