మంగళవారం 11 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jun 05, 2020 , 01:55:15

నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం

నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం

  • త్తి విత్తనాలు, కొవిడ్‌-19పై పోలీస్‌ అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ 

కొత్తగూడెం క్రైం: నకిలీ పత్తి విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, పోలీస్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తన విక్రయాలను పోలీస్‌ అధికారులు అడ్డుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిని  ఉపేక్షించవద్దన్నారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తన విక్రయదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, పీడీ యాక్టు  కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్పీ సునీల్‌దత్‌ మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి అధికారుల ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలను డీజీపీకి వివరించారు. ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పిస్తూనే నకిలీ విత్తన విక్రయదారుల సమాచారం సేకరిస్తున్నామని, అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా పెంచడంతో పాటు గత సంవత్సరం కేసులు నమోదు చేసిన వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ సునీల్‌దత్‌, అధికారులు పాల్గొన్నారు.


logo