సోమవారం 06 జూలై 2020
Badradri-kothagudem - Jun 04, 2020 , 03:32:58

విత్తన షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు

విత్తన షాపుల్లో తనిఖీలు   ముమ్మరం చేసిన అధికారులు

  • డివిజన్‌, మండలాల వారీగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
  • ‌దళారుల దందాకు అడ్డుకట్ట వేస్తున్న వ్యవసాయాధికారులు
  •  గ్రామాల్లో కొనసాగుతున్న ఏఈఓల పర్యవేక్షణ

నకిలీల గుట్టు రట్టవుతోంది..  గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా అనుమతి లేని నకిలీ విత్తనాలు, పురుగుమందులు   లభ్యం కావడంతో ఈ ఏడాది నిఘా ముమ్మరం చేశారు.. రైతుల అవసరాలను అవకాశంగా చేసుకొని నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము         చేసుకునే దళారులపై వ్యవసాయ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.. టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు, వ్యవసాయాధికారులు నిరంతరం విత్తన షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. ఆయా డివిజన్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసి నకిలీ విత్తన విక్రయాలపై ప్రత్యేక దృష్టి  సారించారు. పల్లెల్లో రైతుల ఇంటి వద్దకు వెళ్లి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.  

-ఖమ్మం వ్యవసాయం 

కొత్తగూడెం: నకిలీ విత్తన వ్యాపారులపై ఉక్కుపాదం మోపేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో రెండు బృందాలు అప్రమత్తమయ్యాయి. కొత్తగూడెం, అశ్వారావుపేట వ్యవసాయశాఖ సంచాలకులతో పాటు మరో మూడు శాఖల అధికారుల బృందాలు దాడులు నిర్వహించనున్నారు. గతేడాది విత్తన షాపులపై అధికారులు తనిఖీలు చేసి 12 షాపుల విత్తన డీలర్లపై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేశారు.

జిల్లాలోని 380 మంది డీలర్లు విత్తనాలను విక్రయిస్తున్నారు. ఇప్పటికే విత్తన షాపులు తెరవడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. కొత్తగూడెం నుంచి ఏడీఏ లాల్‌చంద్‌, అశ్వారావుపేట నుంచి అఫ్జల్‌బేగం, వీరితో పాటు పోలీస్‌, విత్తనాభివృద్ధి సంస్థ, తెలంగాణ సీడ్స్‌ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. ‘నకిలీ’లపై ఉక్కుపాదం.. జిల్లాలోని నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే వ్యాపారులపై వ్యవసాయ అధికారుల బృందం నిఘా పెట్టింది. సమాచార వ్యవస్థను పటిష్ట పరిచి నకిలీ విత్తన వ్యాపారుల ఆట కట్టించేందుకు ఆకస్మిక దాడులు చేయనున్నారు. జిల్లాలోని ప్రతి షాపును విజిలెన్స్‌ బృందాలు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం సీడ్స్‌ను విక్రయిస్తున్నారా.. లేదా.. ఏ కంపెనీ సీడ్స్‌.. ఎక్కడి నుంచి వచ్చాయోననే వివరాలపై ఆరా తీస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు.

అధికారులు నకిలీల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఏడాది బీటీ-3 పత్తి విత్తనాలు దొడ్డిదారిలో డీలర్లు విక్రయించడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ సంవత్సరం అధికారులు నకిలీ వ్యాపారులను పట్టుకునేందుకు పూర్తిస్థాయి నిఘా పెంచారు. ఖమ్మం వ్యవసాయం : నకిలీ విత్తనాలు, మందులు కొ నుగోలు చేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం విత్తనాలు, మందులు విక్రయించే వ్యాపారులు, దళారులపై నిఘా పెంచింది. నకి లీ విత్తనాలు రైతులకు అంటగట్టే దళారులపై కొరడా ఝుళిపించనుంది. ఇందుకోసం పోలీస్‌శాఖ, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడూ తనిఖీలు చేపడుతూ విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోడౌన్‌లు, ట్రాన్స్‌పోర్టులపై నిఘా.. ఖమ్మం నగరంలోని పలు ట్రాన్స్‌పోర్టు, ఆయా కంపెనీల, డీలర్లకు చెందిన గోడౌన్లపై సంబంధిత అధికారులు దృషి ్టసారించారు.

మండలాల పరిధిలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక సర్కిల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ ధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయా లు, బస్‌స్టేషన్‌లు, రైల్వే పార్సిల్స్‌ తదితర ప్రదేశాలపై నిఘా పెంచారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని వ్యాపారులకు సూచిస్తున్నారు. నాణ్యమైన పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా డివిజన్‌ వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

నిఘా పెంచుతున్నాం..

నకిలీ వ్యాపారులపై నిఘా పెంచాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే రెండు సమావేశాల్లో నకిలీ విత్తన వ్యాపారుల గురించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే స్థాయిలో జిల్లాలో ఉన్న రెండు బృందాలు ప్రతి షాపును తనిఖీ చేస్తోంది. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం.

-డీఏవో కొర్సా అభిమన్యుడు


logo