బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 03, 2020 , 04:01:45

ప్రణాళిక ప్రకారం ముందుకు

ప్రణాళిక ప్రకారం ముందుకు

భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో విద్య, ఉపాధి, వ్యవసాయంపై ప్రణాళికలు వేసుకొని ముందుకెళ్తున్నామని ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ అన్నా రు.  ఐటీడీఏలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో యూనిట్‌ అధికారులు, ఐటీడీఏ సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు.లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ  పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పదో తరగతి విద్యార్థులకు టెలీయాప్‌, యాదగిరి మాధ్యమం ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నారన్నారు.ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని అన్నారు.  కొత్తగూడెం జిల్లాలో నాలుగు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఉత్పత్తిదారుడి సంఘాన్ని ఎంపిక చేసి పంట నిల్వచేసే గోదాము, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. ‘గిరి వికాసం’ పథకం ద్వారా జిల్లాకు రూ. 11.99 కోట్లు నిర్ద్దేశించామని, మండలాల వారీగా దరఖాస్తులను స్వీకరించామన్నారు. స్వయం సంఘాల మహిళలతో భద్రాచలంలో పప్పు దినుసుల తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. డీడీ జహీరుద్దీన్‌, పరిపాలనాధికారి బీమ్‌ , ఆర్‌వోఎఫ్‌ఆర్‌ శ్రీనివాస్‌, రమణయ్య పాల్గొన్నారు.