మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jun 01, 2020 , 03:01:48

రైతు వేదిక నిర్మాణానికి భూమి సర్వే

రైతు వేదిక నిర్మాణానికి భూమి సర్వే

  • రూ.20లక్షల విలువ చేసే భూమిని 
  • దానం చేసిన రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల

బోనకల్లు : వ్యవసాయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి మండలంలో తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో బోనకల్లు మండలంలో రైతువేదిక నిర్మాణ ప్రక్రియ మొదలైంది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు రాయన్నపేటలో రూ.20లక్షల విలువ చేసే 30 గుంటల భూమిని 2018లో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు దానం చేశారు. రైతు వేదిక కోసం భూమిని కేటాయించినందుకు వెంకటేశ్వరరావును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. దానం చేసిన ఈ భూమిని ఆదివారం సర్వే చేయించి రైతువేదిక నిర్మాణానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి గ్రామ-కోఆర్డినేటర్‌ జంగా రవి, సర్పంచ్‌ కిన్నెర వాణి, ఉపసర్పంచ్‌ ఉయ్యూరు రాధాకృష్ణ