శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 01, 2020 , 02:58:25

అడవులను రక్షించాలి

అడవులను రక్షించాలి

  • రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

 మణుగూరు  :  అడవుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని,  అడవులను నరకడాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశించారు. ఆదివారం ఆయన మణుగూరు ఏరియా ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో గుండాల, ఆళ్లపల్లి, మణుగూరు మండలాల రెవెన్యూ, ఫారెస్టు శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారుల వద్ద ఉన్న మ్యాపులు, రికార్డులు, ఫారెస్టు గెజిట్‌ నోటిఫికేషన్‌ పత్రాలను పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ మండలాల్లో  పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ, ఫారెస్టు భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు అడవుల పట్ల అవగాహన కల్పించాలన్నారు.  ప్రతి మండలంలో ఫారెస్టు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో జాయింట్‌ సర్వే చేపట్టి ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవోలు దామోదర్‌రెడ్డి,  వేణుబాబు, డీసీసీబీ డైరెక్టర్‌ తూళ్లూరి బ్రహ్మయ్య, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఆళ్లపల్లి జడ్పీటీసీ కొమరం హనుమంతు, ఎంపీపీ మంజుభార్గవి,  పీఏసీఎస్‌ చైర్మన్‌  రామయ్య, ఫారెస్టు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.