సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - May 30, 2020 , 02:59:07

వృథా నీటికి చెక్‌డ్యాం

 వృథా నీటికి చెక్‌డ్యాం

సాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌ వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించి సాగు నీరు అందిస్తున్నారు. నదులు, కాలువల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టి సాగునీటి రంగానికి వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. అందులో భాగంగానే జిల్లాలో నూతనంగా 66 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.176.59 కోట్లు మంజూరు చేశారు.. అధికారులు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రవహించే చిన్న నదులపై వాటిని నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. దీంతో జిల్లాలో  ఆయకట్టు సాగు పెరుగనుండటంతో రైతులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.                               

ఖమ్మం: వేల కోట్ల రూపాయలను వెచ్చించి  పెద ్దపెద్ద సాగునీటి ప్రాజెక్టులను కడుతున్న ప్రభుత్వం.. చిన్న నీటి పారుదల రంగ అభివృద్ధికి కూడా గట్టిగా కృషి సాగిస్తున్నది. ఇప్పటికే మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి పనులను చేపట్టింది. ప్రతి ఏడాది 25 శాతం చెరువుల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో, జిల్లాలో చిన్న చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలోని నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నది. రాష్ట్ర  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కృషితో ఖ మ్మం జిల్లాలో 66చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 176.59 కోట్లు మంజూరు చేసింది. ఏయే నియోజకవర్గానికి ఎన్నెన్ని మంజూరయ్యాయో వివరంగా తెలుసుకుందాం.

ఖమ్మం నియోజకవర్గంలో నాలుగు..

ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం అర్బన్‌లో ఒకటి, రఘునాథపాలెం మండలంలో మూడు చెక్‌డ్యాంలు మం జూరయ్యాయి. అర్బన్‌లోని ఖమ్మం నగర పరిధిలోగల ము న్నేరు నదిపై ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జి వద్ద చెక్‌డ్యాం నిర్మించేందు కు ప్రభుత్వం రూ.7కోట్లు మంజూరు చేసింది. దీనికి సం బంధించిన టెండర్‌ ప్రక్రియ ఇటీవలనే పూర్తయింది. పను లు త్వరలో ప్రారంభమవుతాయి. రఘునాథపాలెం మండలంలోని కేవీ బంజర వద్ద నిమ్మవాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి.  మిగతా వాటికి సాంకేతికపరమైన అనుమతులు రావాల్సుంది.

పాలేరు నియోజకవర్గంలో 10..

పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 10 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. ఖమ్మం రూరల్‌ మండలంలోని తనగంపాడు వద్ద ఆకేరు నదిపై రూ.4.29 కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. ఊటవాగు తండా వద్ద ఆకేరు నదిపై రూ.4.29 కోట్ల వ్యయంతో చెక్‌డ్యాం మంజూరైంది. కూసుమంచి మండలంలోని జక్కేపల్లి వద్ద పాలేరు నదిపై రూ. 5 కోట్లు, రాజుపేట వద్ద పాలేరు నదిపై రూ. 4.73 కోట్లు, నేలకొండపల్లి మండలంలోని బుద్దారం గ్రామం వద్ద పాలేరు నదిపై రూ. 4.24 కోట్లు, చెన్నారం గ్రామం వద్ద పాలేరు నదిపై రూ.3.92 కోట్లు, పైనంపల్లి గ్రామం వద్ద పాలేరు నదిపై రూ.4.46 కోట్లు, రామచంద్రాపురం గ్రామం వద్ద పాలేరు నదిపై రూ.4.48 కోట్లు, సదాశివపురం గ్రామం వద్ద శంకర్‌గిరి వాగుపై రూ.1.84 కోట్లు, తిరుమలాయపాలెం మండలంలోని ముజాయిద్‌పురం వద్ద పాలేరు నదిపై రూ.5 కోట్లతో చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి.

మధిర నియోజకవర్గంలో 11..

మధిర నియోజకవర్గంలో 11 చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.63.78 కోట్లు మంజూరు చేసింది. మధిర మండలంలోని చిలుకూరు వద్ద వైరా మున్నేరుపై రూ.4.81 కోట్లు, మధిర వద్ద వైరా మున్నేరుపై రూ.7.36 కోట్లు, సిరిపురం గ్రామం వద్ద వైరా నదిపై రూ.4.31 కోట్లు, తుర్లపాడు గ్రామం వద్ద కట్టలేరు నదిపై రూ.4.55 కోట్లు, ముదిగొండ మండలంలోని ముత్తారం గ్రామం వద్ద మున్నేరుపై రూ. 9.70 కోట్లు, వల్లాపురం గ్రామం వద్ద మున్నేరుపై రూ.10.48 కోట్లు, పండ్రేగుపల్లి గ్రామం వద్ద మున్నేరుపై రూ.5.64 కోట్లు, ఎర్రుపాలెం మండలంలోని పెగళ్లపాడు గ్రామం వద్ద కట్టలేరుపై రూ.4.55 కోట్లు, శంకినివీడు గ్రామం వద్ద కట్టలేరుపై రూ.4.12 కోట్లు, బోనకల్‌ మండలంలోని రేపల్లె గ్రామం వద్ద వైరా మున్నేరుపై రూ.4.12 కోట్లు, రాయన్నపేట గ్రామం వద్ద వైరా మున్నేరుపై రూ.4.11 కోట్లతో చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. వీటిలో ఐదింటికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వాటికి సాంకేతికపరమైన అనుమతులు రావాల్సి ఉంది.

వైరా నియోజకవర్గంలో తొమ్మిది..

వైరా నియోజకవర్గంలోని వైరా, ఏన్కూరు, సింగరేణి, కామేపల్లి మండలాల్లో తొమ్మిది చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.16.26 కోట్లు మంజూరయ్యాయి. వైరా మున్నేరుపై గరికపాడు వద్ద రూ.4.39 కోట్లు, పుణ్యపురం గ్రామం వద్ద గంగదేవిపాడు వాగుపై రూ.2.63 కోట్లు, ఏన్కూరు మండలంలోని నాచారం గ్రామం వద్ద పెద్దవాగుపై రూ.94.80 లక్షలు, రంగాపురం గ్రామం వద్ద మొద్దుపడవ వాగుపై రూ.99.70 లక్షలు, సింగరేణి మండలంలోని రొట్టమాపురేవు గ్రామం వద్ద బుగ్గవాగుపై రూ.1.36 కోట్లు, గేట్‌కారేపల్లి గ్రామం వద్ద బుగ్గవాగుపై రూ.1.39 కోట్లు, రామచంద్రాపురం గ్రామం వద్ద బుగ్గవాగుపై రూ.1.27 కోట్లు, కామేపల్లి మండలంలోని బండిపాడు వద్ద బుగ్గవాగుపై రూ.1.82 కోట్లు, పొన్నెకల్లు గ్రామం వద్ద బుగ్గవాగుపై రూ.1.45 కోట్లతో చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. 

సత్తుపల్లి నియోజకవర్గంలో 15..

సత్తుపల్లి నియోజకవర్గంలోని 15 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.45.87 కోట్లు మంజూరయ్యాయి. తల్లాడ మండలంలోని కుర్నవల్లి గ్రామం వద్ద కట్టలేరుపై రూ.7.40 కోట్లు, పెద్దవాగుపై రూ.1.93 కోట్లు, అంజనాపురం, రేజర్ల గ్రామాల వద్ద పెద్దవాగుపై రూ. 2.77 కోట్లు, రంగం బంజర వద్ద నల్లజల్ల వాగుపై రూ. 2.35 కోట్లు, మిట్టపల్లి గ్రామం వద్ద కట్టలేరుపై రూ. 3.80 కోట్లు, కిష్టారం గ్రామం వద్ద కట్టలేరుపై రూ. 6.72 కోట్లు, కలకొడిమ గ్రామం వద్ద పెద్దవాగుపై రూ. 2.45 కోట్లు, పినపాక గ్రామం వద్ద కట్టలేరుపై రూ. 3.20 కోట్లు, వేంసూరు మండలంలోని అడసర్లపాడు గ్రామం వద్ద కట్టలేరుపై రూ.2.80 కోట్లు, రామన్న పాలెం గ్రామం వద్ద కట్టలేరుపై రూ.2.57 కోట్లు, పెనుబల్లి మండలంలోని మండాలపాడు గ్రామం వద్ద లోతువాగుపై రూ.1.40 కోట్లు, కల్లూరు మండలంలోని యజ్ఞ నారాయణపురం వద్ద పెద్దవాగుపై రూ. 2.80 కోట్లు, పేరువంచ గ్రామం వద్ద కట్టవారి వాగుపై రూ.2.25 కోట్లు, పుల్లయ్య బంజర వద్ద పెద్దవాగుపై రూ.1.84 కోట్లు, వెంకటాపురం గ్రామం వద్ద వాగుపై రూ.1.60 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.