గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 29, 2020 , 00:45:47

భద్రాద్రి జిల్లాలో వర్షం..

భద్రాద్రి జిల్లాలో వర్షం..

కొత్తగూడెం/గుండాల/పినపాక/పాల్వంచ రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, చుంచుపల్లి, టేకులపల్లి,బూర్గంపాడు,దుమ్ముగూడెం,కరకగూడెం, మణుగూరు,గుండాల మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. బూర్గంపాడు మండలంలో ఈదురు గాలులకు పెద్ద చెట్లు నేలకొరిగాయి.పినపాక మండలంలోని పలు గ్రామాల్లోని ఇండ్ల పై కప్పులు, రేకులు లేచిపోయాయి. చెట్లు నేలకూలాయి. పినపాక, గోపాలరావుపేటలో ఇండ్ల రేకులు లేచిపోయి వరిపొలాల్లో పడ్డాయి. గోపాలరావుపేటలో సుమారు 10 ఇండ్ల రేకులు లేచి కిందపడ్డాయి.  జిల్లా అంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పాల్వంచ మండలంలో గాలివానకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.