శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - May 28, 2020 , 01:04:47

జెన్‌కో డైరెక్టర్‌ (సివిల్‌)ను కలిసిన ప్రభుత్వ విప్‌ రేగా

జెన్‌కో డైరెక్టర్‌ (సివిల్‌)ను కలిసిన ప్రభుత్వ విప్‌ రేగా

మణుగూరు : జెన్‌కో డైరెక్టర్‌ (సివిల్‌) అజయ్‌ను హైదరాబాద్‌లోని జెన్‌కో కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లో రూ.8,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణంపై చర్చించారు. పవర్‌స్టేషన్‌లోని నాలుగు యూనిట్లలో పనుల పురోగతిని అజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. పవర్‌ప్లాంట్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలన్నారు.