మంగళవారం 26 మే 2020
Badradri-kothagudem - May 23, 2020 , 23:38:05

రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి..

రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి..

వైరా ఎమ్మెల్యే 

లావుడ్యా రాములునాయక్‌

వైరా: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ని యంత్రిత వ్యవసాయంతోనే అన్నదాతల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. వైరా సొసైటీ కార్యాలయంలో  శనివారం రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొ ర్రా రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.  రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన పంటలనే సాగు చేయాలన్నా రు. మూస పద్ధతిలో వ్యవసాయం చేసి నష్టపోవద్దన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసి అత్యధిక లాభాలు పొందాలన్నారు. రా ష్ట్రంలోని రైతాంగ అభివృద్ధి, సంక్షేమం కోసం ము ఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించేందుకు కృషి చేయడం చరిత్రాత్మకమన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్‌  చైర్మన్‌ సూతకాని జైపాల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రో శయ్య, ఆత్మ కమిటీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ, వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనక దుర్గ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతా రాములు, ఏడీఏ వీ బాబురావు, ఏవో శ్రీరామోజీ పవన్‌కుమార్‌, సొసైటీ డైరెక్టర్లు, సీఈవో నర్సింహారావు, అప్పారావు, ఎంపీటీసీ రాయల రమేశ్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కస్తాల నాగకోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు మిట్టపల్లి నాగి, దార్న రాజశేఖర్‌, అయిలూరి మోహన్‌రెడ్డి, రేచర్ల సత్యం, జాలాది రామకృష్ణ, కొల్లి రమేశ్‌, ఫణితి సైదులు, మేడిశెట్టి కృష్ణ, బొగ్గుల వా సిరెడ్డి, మూడుముంతల బుజ్జి, మోదుగు లక్ష్మయ్య, వీరబాబు, సం పసాల వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు. 


logo