మంగళవారం 26 మే 2020
Badradri-kothagudem - May 22, 2020 , 00:06:07

సర్కారు బాటలో సాగుదాం

సర్కారు బాటలో సాగుదాం

 సీఎం కేసీఆర్‌ మాటకు కట్టుబడి ఉంటాం..

 మొక్కజొన్న జోలికి వెళ్లం..

 వరి, పత్తి, కంది పంటలే సాగు చేస్తాం..

 ఉమ్మడి జిల్లాలో రైతుల ప్రతిజ్ఞ

ఇల్లెందు రూరల్‌: రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతు సం క్షేమ పథకాలు క్రమంగా సత్ఫలితాలనిస్తున్నా యి. ‘రైతు బంధు, రైతుబీమా పథకాలు మాకు ఎం తో ఉపయోపడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు అం దుబాటులోకి తేవడంతో పాటు పంటను మద్ద తు ధరకు కొనుగోలు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. వ్యవసాయంలో నూతన విప్లవానికి నాంది పలుకుతూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు మాకు సమ్మతమే’ అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. ఇల్లెందు మండలంలోని ఒడ్డుగూడెం పంచాయతీ నెహ్రూనగర్‌ గ్రామ రైతులు సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా నియంత్రిత వ్యవసాయానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వానకాలంలో మొక్కజొన్న జోలికి వెళ్లం. వరి, పత్తి, కంది, మినుము, పెసరు వంటి పంటలు సాగుచేస్తాం. కేసీఆర్‌ మాటే మా బాటగా ప్రతిజ్ఞ చేస్తున్నాం..’ అంటూ గ్రామ రైతులంతా ఏకగ్రీవంగా ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఒడ్డుగూడెం సర్పంచ్‌ చాట్ల భాగ్యమ్మ, ఎంపీటీసీ పూనెం లింగమ్మ, రైతు బంధు సమితి కన్వీనర్‌ పెరుమాళ్ల క్రిష్ణయ్య, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ బండారు శ్రీనివాస్‌, రైతులు దనసరి వీరాకుమారి, బండారు వెంకన్న, బింగి వెంకన్న, వల్లాల రాజ య్య, చాట్ల స్వామి, బాలస్వామి, వట్టం కృష్ణ, పగడయ్య, కోటయ్య, శ్రీను, ముత్తయ్య, నగేశ్‌, ఉప్పలయ్య, కమలమ్మ, సావిత్రి, వెంకటమ్మ, రాజమ్మ, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ నిర్ణయంతోనే రైతులకు మేలు..

ఖమ్మం రూరల్‌ : సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత సేద్యానికి అన్నదాతల నుంచి మద్దతు లభిస్తోంది. రూరల్‌ మండలం చింతపల్లిలో రైతాం గం సీఎం కేసీఆర్‌ మాట ప్రకారమే పంటలు సాగు చేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గతంలో ఏ సీఎం చేయని సంచలనత్మాక నిర్ణయాలు రైతుల ప్రయోజనం కోసం తీసుకుని సమర్థవంతంగా అమలు చేస్తున్న సత్తా ఉన్న సీఎం కేసీఆర్‌ మాత్రమే అని.. మాకు ఆయనపై పూర్తి నమ్మకం ఉందని రైతు లు ప్రతిజ్ఞ చేశారు. భక్తరామదాసు, ఎస్సారెస్పీ కా లువల ద్వారా వేసవిలో సైతం చెరువులు నింపాల నే ఆలోచన చేయడం నిజంగా రైతులకు వరమే అని మాజీ సర్పంచ్‌ తోట జగన్‌ అన్నారు. ప్రతిజ్ఞ చేసిన వారిలో రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

వానకాలంలో ప్రణాళిక ప్రకారమే సాగు..

సత్తుపల్లి : సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నిలిపి తెలంగాణను దేశంలోనే విత్తన బాంఢాగారంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట ప్రకారం వ్యవసాయం చేస్తామని మండల పరిధిలోని బుగ్గపాడు రైతులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో కాకర్లపల్లి సొసైటీ చైర్మన్‌ తుమ్మూరి శ్రీరాంప్రసాద్‌, బుగ్గపాడు సర్పంచ్‌ కారం జయేంద్రరావు, రైతులు బొడ్డు శివ, పలగాని దుర్గాప్రసాద్‌, బోయినపల్లి నరేష్‌, అడపా నాగప్రసాద్‌, పలగాని సత్యం, సూరినేని పురుషోత్తంతో పాటు మరికొందరు రైతులు ఉన్నారు.

పత్తిసాగుకు ప్రాధాన్యమిస్తాం

నీటి వనరులు అంతగా లేని ఇల్లెందు ఏజెన్సీలో ఇప్పటివరకు అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశాం. సీఎం కేసీఆర్‌ చెప్పిన మాట ప్రకారం ఇక నుంచి మొక్కజొన్న స్థానంలో పత్తి సాగుకు ప్రాధాన్యమిస్తాం. నేల స్వభావాన్ని పరీక్షించేందుకు భూసార పరీక్ష చేయించుకొని వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచన ప్రకారం వరి, పత్తి, కంది, పెసర, మినుము పంటలను సాగు చేస్తాం.

                          - పూనెం లింగమ్మ, మహిళా రైతు, ఒడ్డుగూడెం, ఇల్లెందు మండలం

సీఎం చెప్పినట్లు నడుచుకుంటాం..

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు మొక్కజొన్న పంటనే అధిక విస్తీర్ణంలో సాగు చేశాం. ఇక నుంచి మొక్కజొన్న పంటకు బదులుగా సాయిల్‌ పరీక్షల ద్వారా వ్యవసాయ అధికారుల సూచన ప్రకారం పత్తి, వరి, కంది, పెసర, మినుము, పెసర, జొన్న వంటి పంటలను సాగు చేస్తాం. 

       - సోలెం జనార్దన్‌, రైతు, నెహ్రూనగర్‌, ఇల్లెందు మండలం 


logo